Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > తాజా > ఇంట్లో నోట్ల కట్టలు..భార్య లంచం డబ్బును బయటపెట్టిన భర్త

ఇంట్లో నోట్ల కట్టలు..భార్య లంచం డబ్బును బయటపెట్టిన భర్త

Manikonda Muncipal DEE Divyajyothi | తన భార్య రూ.లక్షల కొద్దీ లంచం వసూలు చేస్తుందని ఆరోపిస్తూ భర్త ఒక వీడియోను విడుదల చేయడం సంచలనంగా మారింది.

మణికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న తన భార్య దివ్య జ్యోతి ప్రతి రోజూ ఇంటికి భారీగా లంచం డబ్బు తెస్తుందని భర్త ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో ఇంట్లో దాచిన నోట్ల కట్టలను చూపించారు.

కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో దండుకున్న డబ్బును తన భార్య ఇంట్లో దాచినట్లు భర్త తెలిపారు. తమ ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే కనిపిస్తున్నాయి అని, ఆమె సోదరుడికి ఇప్పటికే రూ 1.1 కోట్ల లంచం డబ్బు ఇచ్చినట్లు ఆరోపించారు.

తన పద్దతి మార్చుకోవాలని పలుమార్లు వారించినా తనను లెక్కచేయడం లేదని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions