Mandakrishna Madiga News | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ( Reservations ) ఉప వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ ( MRPS ) వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.
30 ఏళ్ల తమ పోరాటం ఫలించిందని చెప్పారు. తమ జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు MRPS సుదీర్ఘ పోరాటం చేసిందని, ఈ క్రమంలో ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
రాష్ట్రాలకు ఉపవర్గీకరణ ( Sub-Classification ) అధికారం ఉందని సుప్రీం తీర్పును ఆయన స్వాగతించారు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్గీకరణ విజయాన్ని ప్రాణాలర్పించిన MRPS నేతలకు అంకితం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో మొదట వర్గీకరణ చేసింది సీఎం చంద్రబాబే ( Cm Chandrababu )నని మందకృష్ణ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అలాగే వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు చేపట్టకూడదని మందకృష్ణ కోరారు.