Manchu Nirmala Devi Letter | మంచు కుటుంబం (Manchu Family) లో నెలకొన్న వివాదంపై తొలిసారి మోహన్ బాబు సతీమణి స్పందించారు.
మంచు విష్ణు (Manchu Vishnu) పై అబండాలు వేసి మనోజ్ (Manchu Manoj) పోలీసు ఫిర్యాదు చేసినట్లు తల్లి నిర్మల (Manchu Nirmala Devi) పేర్కొన్నారు.
కాగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోకి వచ్చిన విష్ణు గొడవ చేసినట్లు మనోజ్ ఆరోపించారు. జెనరేటర్ లో పంచదార పోసి భయభ్రాంతులకు గురిచేసినట్లు మనోజ్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తల్లి నిర్మల స్పందిస్తూ.. తన పుట్టినరోజు నాడు విష్ణు కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసాడు, విష్ణు ఆరోజు ఎలాంటి గొడవ చేయలేదని స్పష్టం చేశారు.
ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందన్నారు. మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఈ మేరకు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు లేఖ రాశారు.