MLA On Wheels | తెలంగాణలోని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కొత్త కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు.
“ఎమ్మెల్యే ఆన్ వీల్స్” పేరుతో కొత్త పథకాన్ని చేపట్టారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమానికి ఒక ప్రత్యేక వాహనాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పేరుతో ఒక యాప్ ను రూపొందించనున్నారు. నియోజకవర్గంలోని ఈ యాప్ ద్వారా తమ సమస్యను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేయవచ్చు. ఆ సమస్యను తెలియజేయడం ద్వారా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనం ఆయా గ్రామానికి వస్తుంది. అందులో సంబంధింత అధికారుల సమస్యను వెలిబుచ్చిన గ్రామానికి వస్తారు. అక్కడి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి సమస్యలకు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. ఈ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంపై స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది.ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు త్వరితగతిన పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
