Kurnool Bus Fire Accident | కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ఉన్న జాతీయ రహదారి 44పై ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్దమైన ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను తీసుకుని హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది.
ఇదే సమయంలో కర్నూలు వద్ద ప్రమాదం జరగడంతో మంటలు చెలరేగాయి. 19 మంది సజీవదహనం అయ్యారు. 21 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాలను శోక సంద్రంలో ముంచేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత హిందూపూర్ కు చెందిన నవీన్ అనే వ్యక్తి తన కారులో ఆరుగురిని కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. అలాగే పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న హేమా రెడ్డి అనే మహిళ మంటలు చెలరేగడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.









