Thursday 8th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ విజేతగా కేరళ భామ కజియా లిజ్ మెజో!

‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ విజేతగా కేరళ భామ కజియా లిజ్ మెజో!

  • ప్యూర్టో రికోలో భారత్ తరఫున పోటీ!

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీ ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ గ్రాండ్ ఫినాలే ఆగస్టు 23, ఆదివారం నాడు జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో అత్యంత కోలాహలంగా జరిగింది. 52 మంది ఫైనలిస్టులతో పోటీపడి కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో ఈ ఏడాది ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని కైవసం చేసుకుంది.

టాప్ 3 విజేతలు వీరే:
మిస్ యూనివర్స్ ఇండియా 2026: కజియా లిజ్ మెజో (కేరళ).
ఫస్ట్ రన్నరప్: వైష్ణవి గణేష్ (తమిళనాడు) – ఈమె ‘మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026’ టైటిల్‌ను కూడా దక్కించుకుంది.
సెకండ్ రన్నరప్: అనుశ్రీ సతవ్లేకర్ (గుజరాత్).

సుస్మితా సేన్ నేతృత్వంలో జ్యూరీ..

ఈ పోటీల విజేతను ఎంపిక చేయడానికి 1994లో భారతదేశం తరపున మొదటి మిస్ యూనివర్స్‌గా నిలిచిన సుస్మితా సేన్ నేతృత్వంలో ప్రముఖుల జ్యూరీ వ్యవహరించింది. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా విజేతలు సెలీనా జైట్లీ (2001), ఊర్వశి రౌతేలా (2015), మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా, చలనచిత్ర నిర్మాత ప్రజ్ఞా కపూర్, పారిశ్రామికవేత్త విషా లాధియా, మిస్ చార్మ్ 2025 అన్నా బ్లాంకో మరియు డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్తుతి ఖరే శుక్లా జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.

వేలాది మంది దాటి ఫినాలే వరకు..

సుమారు 8,000 నుండి 9,000 మంది ఆశావాహుల నుంచి ప్రాంతీయ పోటీలు, ఆడిషన్లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు మరియు NRI కేటగిరీ ద్వారా 52 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు. వీరందరికీ శాషింగ్ వేడుక, స్విమ్‌సూట్ రౌండ్ మరియు ప్రసంగ రౌండ్లలో కఠినమైన శిక్షణ ఇచ్చి గ్రాండ్ ఫినాలేను నిర్వహించారు.

గ్లోబల్ వేదికపై భారత్ ఆశలు..

జాతీయ కిరీటాన్ని గెలుచుకోవడంతో కజియా ప్రయాణంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది. నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ అంతర్జాతీయ పోటీలలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. 19 ఏళ్ల పిన్న వయసులోనే కజియా దేశం తరఫున గ్లోబల్ కిరీటం కోసం పోటీ పడబోతోంది.

You may also like
నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్!
Ram Charan
శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ ‘లాలో’ తెలుగు రీమేక్!
Mrunal Thakur
డీప్‌ఫేక్‌ కంటెంట్ పై నటి మృణాల్ ఠాకూర్ వార్నింగ్!
rashmika mandanna
రష్మిక మందన్నకు తీవ్ర గాయం.. 6 వారాల విశ్రాంతి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions