Kavitha Kalvakuntla About Group-1 Issue | గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను తొందరపడి డిస్పోజ్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ మేరకు గ్రూప్-1 అంశంపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రూప్ – 1 నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కులేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను గమనిస్తే మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో అర్ధం అవుతుందని పేర్కొన్నారు. గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల వివాదం న్యాయ స్థానాల్లో తేలేవరకు అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను తొందరపడి డిస్పోజ్ చేయొద్దని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ -1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అనేక తప్పులు చేసిందని.. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చేలోపు ప్రభుత్వం అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేస్తే నిరుద్యోగులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను స్తంభింప చేయడానికి సిద్ధంగా. ఉన్నట్లు కవిత హెచ్చరించారు.









