Monday 2nd March 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఐపీఎల్ మెగా ఆక్షన్..వేలంలోకి 42 ఏళ్ల స్టార్ బౌలర్

ఐపీఎల్ మెగా ఆక్షన్..వేలంలోకి 42 ఏళ్ల స్టార్ బౌలర్

James Anderson In IPL 2025 Mega Auction | ఐపీఎల్ ( IPL ) 2025 మెగా ఆక్షన్ ( Mega Auction ) కు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 24, 25 తేదీల్లో రియాద్ వేదికగా ఈ మెగా వేలం జరగనుంది.

ఇప్పటికే టీం ఇండియా ( Team India ), విదేశీ ప్లేయర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. అయితే ఈ లిస్ట్ లో ఇంగ్లాడ్ వెటరన్ 42 ఏళ్ల స్టార్ ప్లేయర్ జేమ్స్ ఆండర్సన్ ( James Anderson ) కూడా ఉండడం ఆశ్చర్యంగా మారింది.

ఈ ఏడాది టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్ చివరగా 2014లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఇతర లీగుల్లో అతను ఆడలేదు.బేస్ ప్రైజ్ ( Base Prize ) రూ.1.25 కోట్లకు పేరును నమోదు చేసుకున్నాడు.

2009లో చివరి ఇంటర్నేషనల్ ( International ) టీ20, 2014లో డెమోస్టిక్ ( Domestic ) టీ20 ఆడిన ఆండర్సన్ ఇప్పుడు ఐపీఎల్ లో పేరును నమోదు చేసుకోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 42 ఏళ్ల ఆండర్సన్ ను ఫ్రాంచైజీలు తీసుకోకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా ఇంగ్లాడ్ ( England ) మరో స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ( Ben Stokes ) మాత్రం ఈ సారి ఐపీఎల్ మెగా ఆక్షన్ లో తన పేరును నమోదు చేసుకోలేదు.

You may also like
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు
ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions