Tuesday 8th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రంప్ విజయం..రూ.2 లక్షల కోట్లు పెరిగిన మస్క్ సంపద

ట్రంప్ విజయం..రూ.2 లక్షల కోట్లు పెరిగిన మస్క్ సంపద

Elon Musk Net Worth News | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు.

అయితే ట్రంప్ విజయంలో వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ ( Elon Musk ) కీలక పాత్ర పోషించారు. ట్రంప్ కు మద్దతుగా ప్రచారం చేయడమే కాకుండా, భారీ మొత్తంలో విరాళం కూడా ఇచ్చారు.

మరోవైపు తాజగా వెలువడిన ఫలితాల్లో ట్రంప్ విజయంతో ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరిగింది. కేవలం ఒక్కరోజులోనే రూ.2 లక్షల కోట్ల మేర మస్క్ సంపద పెరిగింది. ట్రంప్ విజయం మస్క్ సంస్థల షేర్ల ( Shares )పై సానుకూల ప్రభావం చూపింది.

26.5 బిలియన్ డాలర్ల సంపద పెరగడంతో ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా ఉన్న మస్క్ సంపద 290 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే అమెజాన్ ( Amazon ) జెఫ్ బేజోస్ ( Jeff Bezos ) సంపద 7.14 బిలియన్ డాలర్లు పెరిగి 228 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా తన ఎన్నికల ప్రచారంలో మస్క్ ఎంతగానో సహకరించినట్లు ట్రంప్ అభినందించిన విషయం తెల్సిందే.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions