Hyderabad Metro Extends Services for Ganesh Immersion | హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు ఘనంగా జరగనున్నాయి. నగరం వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రతిష్టించిన గణనాథులు 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకుని శనివారం నిమజ్జనానికి బయలుదేరానున్నారు.
శనివారం హైదరాబాద్ వ్యాప్తంగా కోలాహలం నెలకొననుంది. సుమారు 40 లక్షల మంది భక్తులు గణేశుడి శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో భక్తులకు తీపి కబురు అందించింది.
శనివారం ఉదయం ఆరు గంటల నుంచి మొదలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా మెట్రో రైళ్లు నడుస్తాయని ప్రకటించింది. నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి భక్తులు వివిధ ప్రాంతాలకు వెళ్తారు. ఈ క్రమంలో వారు సురక్షితంగా, వేగంగా గమ్యాన్ని చేరుకోవడానికి మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది.









