Monday 14th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కాలేజీలో సీక్రెట్ కెమెరాలు కలకలం..స్పందించిన సీఎం

కాలేజీలో సీక్రెట్ కెమెరాలు కలకలం..స్పందించిన సీఎం

cbn press meet

Hidden Cameras In Girls Hostel Gudlavalleru | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ( Gudlavalleru )లోని ఇంజనీరింగ్ కాలేజీ బాలికల హాస్టల్ వాష్ రూమ్ ( Hostel Washroom ) లో సీక్రెట్ కెమెరాలు ( Hidden Cameras )పెట్టారని విద్యార్థినీలు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం కలకలం రేపుతోంది.

ఇప్పటికే బిటెక్ ( B.tech ) సీనియర్ విద్యార్థిని పోలీసులు ప్రశ్నించారు. కాగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు.

హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ( Cm Chandrababu ) విచారణకు ఆదేశించారు. హాస్టల్ లో రహస్య కెమేరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సిఎం ఆదేశించారు.

తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

You may also like
ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసింది
బ్రాహ్మణికి పోలీసులతో వందనం చేయించడం కాదు : వైసీపీ
ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు..అర్ధరాత్రి హైడ్రామా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions