Sunday 1st March 2026
12:07:03 PM
Home > తాజా > నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం..భారీగా మృతుల సంఖ్య..!

నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం..భారీగా మృతుల సంఖ్య..!

nampally fire accident

Nampally Fire Accident | హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ గోడౌన్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఓ అపార్టుమెంటు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తుల వరకు వ్యాపించాయి.

ఈ అపార్ట్మెంట్ లోని 3వ, 4వ ఫ్లూర్స్ లో పలు కుటుంబాలు అద్దెకు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ లో డీజీల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో మంటలు పై ఫ్లోర్స్ కి వేగంగా వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఫైర్‌ సిబ్బంది నాలుగు ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు.

కాగా ఈ దుర్ఘటనలో (Nampally Fire Accident ) ఇప్పటికే తొమ్మిది మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఊపిరాడక, మరికొందరు సజీవ దహనం అయ్యారు.

అలాగే తీవ్ర గాయాలపాలైన మరో ఎనిమిది మందిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొనున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.

You may also like
vc sajjanar
పెళ్లి పేరుతో మోసాలు.. అమ్మాయిలూ.. బీ కేర్‌ఫుల్: సీపీ సజ్జనర్!
Fire breaks out at Aditya Enclave
HYD- అమీర్ పేట్ లో అగ్ని ప్రమాదం!
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!
fire accident in nampally
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions