Sunday 11th May 2025
12:07:03 PM
Home > తాజా > బీఆరెస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్..!

బీఆరెస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్..!

cm kcr
  • బీఆరెస్ ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం

KCR as BRSLP Leader | తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆరెస్ శాసనసభ పక్ష నేతగా మాజీ సీఎం, బీఆరెస్ సుప్రీమో కేసీఆర్ ను ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు.

ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యారు. కాగా బీఆరెస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు బలపరిచారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ ను బీఆరెస్ ఎల్పీ నేతగా ఎమ్మెల్యే లంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం అందరూ ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీ కి బయలుదేరారు. ఇదిలా ఉండగా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే లంతా ప్రమాణ స్వీకారం చేశారు.

You may also like
Sajjanar
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!
‘కొత్త పార్టీ ప్రచారంపై హరీష్ రావు రియాక్షన్’
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions