Sunday 27th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వారికి రోజుకో మిలియన్ డాలర్లు..ఎలన్ మస్క్ బంపర్ ఆఫర్

వారికి రోజుకో మిలియన్ డాలర్లు..ఎలన్ మస్క్ బంపర్ ఆఫర్

Elon Musk Offers $1 Million For Trump Supporters | ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ ( Elon Musk ) బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమెరికా ( America ) అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.

నవంబర్ 5న జరగనున్న ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ), డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హ్యారీస్ ( Kamala Harris ) తమ ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. ఇదిలా ఉండగా డోనాల్డ్ ట్రంప్ కు ఎలన్ మస్క్ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే.

కేవలం మద్దతును ప్రకటించడమే కాకుండా ట్రంప్ కోసం ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ తో కలిసి పలు సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మద్దతు దారులకు మస్క్ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించారు.

డోనాల్డ్ ట్రంప్ కు మద్దతును ఇస్తూ పిటీషన్ పై సంతకాలు చేసిన వారిలో రోజుకొక వ్యక్తికి లక్కీ డ్రా ( Lucky Draw ) ద్వారా మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎలక్షన్ జరిగే నవంబర్ 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం జాన్ అనే వ్యక్తికి మిలియన్ డాలర్లు అందించారు.

You may also like
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’
‘బీఆరెస్ రజతోత్సవం..కేసీఆర్ కోసం వెండి శాలువా’
‘బీఆరెస్ సభ ఏర్పాట్లు కళ్ళు బైర్లు కమ్మేలా ఉంది..కానీ’
‘130 అణుబాంబులు..భారత్ కు పాక్ మంత్రి బెదిరింపులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions