Nominations In Telugu States | సార్వత్రిక ఎన్నికల్లో (General Elections 2024) భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మే13న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 15 న నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసిన విషయం తెల్సిందే.
అనంతరం ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా సోమవారంతో ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4, 210 నామినేషన్లు, 25 పార్లమెంటు స్థానాలకు 731 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
తెలంగాణ (Telangana) లోని 17 పార్లమెంటు స్థానాలకు గాను మొత్తం 625 నామినేషన్లు దాఖలయ్యాయి. మే 13న పోలింగ్ తర్వాత జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.