Cricketer Rinku Singh Gets Engaged To MP Priya Saroj | టీం ఇండియా ( Team India ) డాషింగ్ క్రికెటర్ రింకూ సింగ్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.
ఈ స్టార్ క్రికెటర్ కు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఎంపీ ప్రియా సరోజ్ ( Priya Saroj ) తో నిశ్చితార్థం జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే వీరి ఎంగేజ్మెంట్ ( Engagement ) పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని మచ్లిషహర్ ( Machhali Shahar ) పార్లమెంటు స్థానం నుండి సమజ్వాదీ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే ఆమె పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొంది వార్తల్లోకి ఎక్కారు.
మరోవైపు అతిసాధారణ కుటుంబం నుండి వచ్చి క్రికెట్ లో రాకెట్ లా దూసుకువచ్చారు రింకూ సింగ్. ఐపీఎల్ లో భాగంగా ఆయన కోల్కత్త నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న విషయం తెల్సిందే.