CM Revanth Reddy | హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో గురువారం రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రవాణాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) సందర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీ నగరంలో కాలుష్యం వల్ల అక్కడ అప్రకటిత లాక్ డౌన్ విధించారనీ.. కొన్నేళ్ల తర్వాత ప్రజలు ఢిల్లీని విడిచి వెళ్లిపోతారని తెలిపారు. హైదరాబాద్ నగరానికి అలాంటి పరిస్థితి రాకుండా చేసేందుకు స్క్రాప్ పాలసీ (Scrop Policy) తీసుకు వచ్చామని తెలిపారు.
15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ కు పంపి కాలుష్యం తగ్గేలా చేస్తామని అన్నారు. ఈవీ వాహనాలు (EV Vehicles) కొన్నవారికి రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఆర్టీసీలో ఉన్న డీజిల్ బస్సులను రానున్న 2 ఏళ్లల్లో సిటీ బయటికి తరలిస్తామని చెప్పారు.
నగరంలో 3000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకు వస్తామని ప్రకటించారు. డీజిల్ ఆటోలను కూడా సిటీ అవతలికి తరలిస్తామని, ఎలక్ట్రిక్ ఆటోలు కొన్నవారికి రాయితీలు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తామని తెలిపారు.