Monday 12th May 2025
12:07:03 PM
Home > సినిమా > పుష్ప2 ను బాయ్ కాట్ చేస్తారట.. కన్నడీయుల ఆగ్రహం.. కారణమిదే!

పుష్ప2 ను బాయ్ కాట్ చేస్తారట.. కన్నడీయుల ఆగ్రహం.. కారణమిదే!

Boycott Pushpa2 Trending | టాలీవుడ్ (Tollywood)తో పాటు దేశంలో సినీ ప్రియులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2 (Puspha2). అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

డిపెంబర్ 5న పుష్ప2 దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా పుష్ప2 చిత్రంపై కన్నడ సినీ ప్రియులు గుర్రుగా ఉన్నారు. శాండల్ వుడ్ లో పుష్ప2ను బాయికాట్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీనికి కారణం దీపావళి సందర్భంగా కన్నడ మూవీ బఘీర తెలుగులో కూడా విడుదలయ్యింది. అయితే ఈ సినిమాకి తెలుగులో తక్కువ థియేటర్స్ ఇచ్చారని, ఇప్పుడు ఆ సంఖ్యను మరింత తగ్గించారని కన్నడ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.

అంతేకాదు ఈ కన్నడ సినిమాపై తెలుగు వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘ పుష్ప-2 ‘ సినిమాను కన్నడ ఇండస్ట్రీలో బాయ్ కాట్ చేయాలని అని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగులో బఘీర సినిమాకి తక్కువ థియేటర్ లు ఇవ్వడానికి ప్రధాన కారణం అమరన్, లక్కీ భాస్కర్, క, సినిమాలతో పాటు ఈ బఘీర సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక బఘీర సినిమా మొదటి నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకి థియేటర్లు తక్కువ కేటాయించారు.  

You may also like
allu arjun gets interim bail
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. క్రేజీ వీడియో రిలీజ్!
rashmika mandanna
రష్మిక మందన్న పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్!
allu arjun
అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత..
vijay and rashmika in vd14
మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి సిద్ధమైన టాలీవుడ్ క్రేజీ జోడి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions