Ambedkar Statue Controversy | భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అంబేద్కర్ ను నేడు స్వతంత్ర భారతం లో అదే కుల వివక్ష వెంటాడింది.
తమ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రామ బహిష్కరణ జరిగిందని దళితులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా అనగానే అందరికి పచ్చని చెట్లు, నలువైపులా వాగులు, ఆహ్లాదకరమైన వాతావరణం గుర్తువస్తాయి.
అటువంటి గోదావరి జిల్లాలో కుల వివక్ష అనేది ఏకంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను సైతం వదలలేదు.
జిల్లాలోని గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో ఓ సామాజిక వర్గం ప్రజలు తాము అధికంగా ఉండే గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినందుకు సుమారు 100 ఎస్సీ కుటుంబాలని గ్రామపెద్దలు బహిష్కరించారని దళితులు ఆరోపించారు.
ఎస్సీ పేటకు వెళ్లే దారిని ఆనుకోని ఉన్న పంచాయతీ స్థలంలో జూన్ 9న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో ఈ వివాదం రాజుకుంది.
జూన్ 10 అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించడానికి గ్రామపెద్దలు పోలీసుల సహాయంతో ప్రయత్నించారని, దీనిని అడ్డుకున్న దళితుల పైన దాడి జరిగిందని వారు ఆరోపించారు.
ఈ దాడిలో పలువురికి కాళ్లు, చేతుకు విరిగాయని వారు ఆరోపించారు.
ఈ వివాదం 20రోజుల ముందే మొదలయ్యింది. గ్రామంలో ఉన్న పాఠశాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని వేసవి సెలవుల్లో కొందరు ఆకతాయిలు ద్వంసం చేశారు.
విగ్రహాన్ని ద్వంసం చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని దళితులు ఆందోళనకు దిగారు. కానీ ఎవరు విగ్రహాన్ని ధ్వంసం చేశారో తమ వద్ద ఆధారాలు లేవని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.
దీనితో జూన్ 9న గ్రామ పంచాయతీ స్థలంలో అంబేద్కర్ (Ambedkar Statue) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఇతర సామాజిక వర్గానికి చెందిన వారి నివాసాలు ఎక్కువగా ఉంటాయి.
తమ ఇళ్ల వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని వారు అభ్యంతరం తెలిపారు.వారి అభ్యంతరాన్ని పట్టించుకోకుండా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దళితులు.
Ambedkar Statue Controversy దానితో అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, విగ్రహాన్ని తొలగించాలని గ్రామంలోని మెజారిటీ ప్రజలు ఆందోళనలకు దిగారు.
దానితో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించకూడదని దళితులు అక్కడే బయటాయించారు.
దానితో కరెంట్ తీసివేసి తమ పైన దాడి చేశారు అని దళిత మహిళలు ఆరోపించారు.ఈ సంఘటన తర్వాత ఎస్సీల పైన రెండు కేసులు నమోదయ్యాయి.
ఒకటి అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కార్యదర్శి ఇచ్చిన కంప్లైంట్ అలాగే విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల పైన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు.
కొనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు, అలాగే మరత్వడా లో యూనివర్సిటీకి అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ఇలా చాలా సార్లు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
భారత్ లో పుట్టిన ప్రతిఒక్కరికి హక్కులు ప్రసాదించిన అంబేద్కర్ పైన ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం.