Actor Fish Venkat about Pawan Kalyan | టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే ఫిష్ వెంకట్ కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు దూరమయ్యాడు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో రోజూ డయాలసిస్ చేయించుకున్నారు. దీంతో సాయం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లగానే ఆదుకున్నారంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఫిష్ వెంకట్.
నా పరిస్థితి బాగాలేదు. నాకు షుగర్ పెరిగి, బీపీ వచ్చి ఆరోగ్యం చాలా క్రిటికల్‌గా ఉంది. కిడ్నీలు ఫెయిల్ అయి ప్రతిరోజూ డయాలసిస్ చేసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ సార్ ని కలిస్తే సాయం చేస్తారని నా భార్య సలహ ఇచ్చింది. వెంటనే పవన్ సార్ దగ్గరికెళ్లి సార్ ఇదీ నా పరిస్థితి అని చెప్పడంతో వెంటనే స్పందించారు. వెంకట్ గారు నా తరఫు నుంచి ఏం చేయాలన్నా అది చేస్తా.. మీ ఆరోగ్యం బాగుపడటానికి ఏం కావాలన్నా చేయిస్తా అంటూ మాటిచ్చారు. నా ఆర్థిక పరిస్థితి బాలేదంటే రూ.2 లక్షల రూపాయిలు నా బ్యాంక్ అకౌంట్‌లో వేయించారు. ఆయనకి నా పాదాభివందనాలు. జీవితంలో మర్చిపోలేని సాయం ఇది..
నా కన్నతల్లిదండ్రులు ఎంతనో మీరు కూడా అంతే సార్ నాకు. మా కుటుంబానికి మీరు చేసిన సాయం మాటల్లో చెప్పలేను. నాకు ఇంత సాయం చేసిన ఏకైక వ్యక్తి పవన్ సార్.” అంటూ ఎమోషనల్ అయ్యారు ఫిష్ వెంకట్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.