Thursday 24th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘ది ప్యారడైజ్’ టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి విషెస్!

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి విషెస్!

Chiranjeevi
  • నాని ఆకలి, నిబద్ధతపై ప్రశంసల వర్షం!

Chiranjeevi Wishes Nani For The Paradise | నేచురల్ స్టార్ నాని, సుప్రసిద్ధ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ అంచనాల చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల కానున్న నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. నాని నటన పట్ల చూపించే నిబద్ధతను, నిరంతరం కొత్తదనాన్ని కోరుకునే అతని తపనను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన స్ఫూర్తిదాయక సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నాని నిబద్ధతపై ప్రశంస..

“నా ప్రియమైన నాని.. కొత్త విషయాలు తెలుసుకోవాలనే నీలోని ఉత్సాహం, ఆకలి, నిజాయితీ ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి” అని చిరంజీవి పేర్కొన్నారు. ‘దసరా’ సినిమా కోసం నాని, శ్రీకాంత్ ఓదెల పడిన తపన, చూపిన అభిరుచి చూసిన తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ అనే సరికొత్త ప్రపంచాన్ని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన సినిమాను పెద్ద తెరపై అనుభూతి చెందాలని తాను భావిస్తున్నట్లు మెగాస్టార్ తెలిపారు.

కొత్త మైలురాళ్లు సృష్టించాలి..

చిత్ర బృందానికి తన ఆశీస్సులు అందిస్తూ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించి, అందరికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వివరించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions