Saturday 4th July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీవారి దర్శనం కోసం మెట్లెక్కిన 116 ఏళ్ల బామ్మ!

శ్రీవారి దర్శనం కోసం మెట్లెక్కిన 116 ఏళ్ల బామ్మ!

116 Year Old Woman Climbs Tirumala Hills | కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వేంకటేశుడిపై వాడిపై అచంచలమైన భక్తి, నమ్మకం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపించారు ఓ శతాధిక వృద్ధురాలు.

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఏకంగా 116 ఏళ్ళ వయసున్న బామ్మ కాలినడకన కొండపైకి ప్రయాణమై అందరినీ ఆశ్చర్యపరిచారు.

సాధారణంగా యువకులే తిరుమల మెట్లు ఎక్కడానికి ఆయాసపడిపోతుంటారు.. అలాంటిది ఈ వయసులో ఆమె చేసిన సాహసం ఇప్పుడు తిరుమలలోనే కాక సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

కర్ణాటక నుంచి కాలినడకన.. నెటిజన్లు ఫిదా..

మండ్య లేదా మైసూరు ప్రాంతానికి చెందిన ఈ కన్నడ బామ్మ, తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు.

కొండపైకి వెళ్లేందుకు వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, బస్సులు ఉన్నప్పటికీ.. బామ్మ మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయబద్ధంగా మెట్ల మార్గాన్నే (Alipiri / Srivari Mettu) ఎంచుకున్నారు.

గోవింద నామస్మరణతో..

(116 Year Old Woman Climbs Tirumala Hills) మెట్లను ఎక్కుతూ ఆమె చూపిన ఉత్సాహం, శరీర దృఢత్వం చూసి తోటి భక్తులు ముక్కున వేలేసుకున్నారు. బామ్మ మెట్లెక్కుతున్న దృశ్యాలను కొందరు భక్తులు తమ మొబైల్స్‌లో రికార్డ్ చేయగా, అవి కాస్తా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

బామ్మగారి సంకల్ప బలాన్ని చూసిన నెటిజన్లు, “ఇది కేవలం శారీరక దృఢత్వం మాత్రమే కాదు.. ఆ స్వామి వారిపై ఉన్న అపారమైన భక్తి ప్రపత్తులే బామ్మను ఇలా అవలీలగా నడిపిస్తున్నాయి. గోవిందా.. గోవింద!” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions