Friday 3rd July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రూ. 1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిపై బిస్కట్ దొంగతనం నింద!

రూ. 1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిపై బిస్కట్ దొంగతనం నింద!

ఫోర్డ్ కంపెనీ నిర్వాకం!

Ford Fires Electrician Over Chocolate Cookie | ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్ మోటార్ కంపెనీ’ (Ford Motor Co.) కేవలం ఒక చిన్న చాక్లెట్ కుకీ (బిస్కట్) విషయంలో అతిగా స్పందించి, చివరకు పెద్ద తప్పులో కాలేసింది.

కంపెనీలో ఏటా సుమారు రూ. 1.9 కోట్ల ($200,000) భారీ జీతం అందుకుంటున్న 60 ఏళ్ల సీనియర్ ఎలక్ట్రీషియన్ కర్ట్ క్రోమ్‌ (Kurt Kromm) ను ఒక చిన్న పొరపాటు కారణంగా దొంగతనం ఆరోపణలతో ఫోర్డ్ యాజమాన్యం ఉద్యోగం నుండి తొలగించింది.

అయితే చివరకు అసలు నిజం తెలుసుకుని సదరు ఉద్యోగిని బతిమిలాడినా ఆయన వెనక్కి తగ్గకపోవడం ఇప్పుడు అంతర్జాతీయ కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: లోయలోకి పడిన బస్సు.. 40 మంది దుర్మరణం!

అసలేం జరిగిందంటే..?

అమెరికాలోని ఫోర్డ్ కెంటకీ ట్రక్ ప్లాంట్ (Ford Kentucky Truck Plant) లో కర్ట్ క్రోమ్ ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఒకరోజు విరామ సమయంలో ప్లాంట్‌లోని క్యాంటీన్‌కు వెళ్లిన క్రోమ్.. అక్కడ కేవలం $1.95  విలువైన ఒక చాక్లెట్ కుకీని తీసుకున్నారు.

అనంతరం అక్కడి సెల్ఫ్-చెక్అవుట్ కియోస్క్ (Kiosk) మిషన్ ద్వారా పేమెంట్ చేశారు. అయితే ఆ మిషన్‌లో సాంకేతిక లోపం కారణంగా పేమెంట్ ఫెయిల్ అయినట్లు డిస్‌ప్లే అయ్యింది.

దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను చూసిన క్యాంటీన్ మేనేజ్‌మెంట్ మరియు యూనియన్ ప్రతినిధులు.. క్రోమ్ డబ్బులు కట్టకుండా బిస్కట్ దొంగిలించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా ఆయన్ను ప్లాంట్ నుండి బయటకు పంపించి, ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నిరూపితమైన నిజం..

కంపెనీ తనపై దొంగతనం ముద్ర వేయడాన్ని కర్ట్ క్రోమ్ తీవ్రంగా పరిగణించారు. కేవలం రూ. 186 కోసం రూ. కోట్ల జీతం ఉన్న తాను దొంగతనం చేయాల్సిన అవసరం లేదని భావించిన ఆయన తన వైపు ఉన్న నిజాయతీని నిరూపించుకున్నారు.

బ్యాంక్ రికార్డుల సాక్ష్యం..

కియోస్క్ మిషన్లు తరచూ సాంకేతిక లోపాలకు గురవుతుంటాయని క్రోమ్ పేర్కొన్నారు. తన డెబిట్ కార్డ్ నుండి సదరు $1.95 (రూ. 186) లావాదేవీ విజయవంతంగా పూర్తయి, డబ్బులు కట్ అయినట్లు చూపే పక్కా బ్యాంక్ స్టేట్‌మెంట్ రికార్డులను ఆయన యాజమాన్యానికి సాక్ష్యంగా సమర్పించారు.

Also Read: జపాన్ ప్రధాని ‘సంతూర్’ విన్యాసం.. వీడియో వైరల్!

చివర్లో ప్లేట్ ఫిరాయించిన ఫోర్డ్ ..

 ఉద్యోగి సమర్పించిన బ్యాంక్ ఆధారాలను చూసిన ఫోర్డ్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అనంతరం క్యాంటీన్ వెండార్‌తో మాట్లాడిన ఫోర్డ్ యాజమాన్యం.. నిజంగానే క్రోమ్ ఖాతా నుండి డబ్బులు చెల్లింపు జరిగిందని అధికారికంగా నిర్ధారించుకుంది.

తమ పరువు పోతుందనే భయంతో కంపెనీ తక్షణమే క్రోమ్‌కు క్షమాపణలు చెప్పడమే కాకుండా, తిరిగి పాత ఉద్యోగంలో చేరాలని కోరింది. కానీ, తన నిజాయితీని నమ్మకుండా అవమానకర రీతిలో బయటకు పంపిన ఫోర్డ్ కంపెనీ ప్రతిపాదనను కర్ట్ క్రోమ్ నిర్మొహమాటంగా తిరస్కరించారు.

ఫోర్డ్ ఇచ్చిన ఆఫర్‌ను కాదనుకున్న ఆయన.. అంతకంటే ఎక్కువ జీతం (Higher-paying job) ఇచ్చే మరో ప్రముఖ ప్లాంట్‌లో గౌరవప్రదమైన కొత్త ఉద్యోగంలో చేరి ఫోర్డ్ యాజమాన్యానికి గట్టి బుద్ధి చెప్పారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions