– పుణె లోహగఢ్ హత్యోదంతం వైరల్!
Ketan Siya Pre Wedding Shoot Viral Video | “ప్రేమగా నటించి.. నమ్మించి ప్రాణాలు తీయడం” అనే సినిమా తరహా ఘోరకలి నిజజీవితంలో వెలుగుచూసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పుణె సమీపంలోని చారిత్రాత్మక లోహగఢ్ కోట పరిసరాల్లో జరిగిన కేతన్ హత్య కేసులో ఊహించని నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితురాలు సియా, బాధితుడు కేతన్‌ల ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ (Pre-Wedding Shoot) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిందితురాలి నటనకు, ఆమె చేసిన ఘాతుకానికి షాక్‌కు గురవుతున్నారు.
వీడియోలో ప్రేమ.. మనసులో కాలకూట విషం..
వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోలో సియా, కేతన్ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటున్నట్టు కనిపిస్తారు. సియా తనను ప్రాణంగా ప్రేమిస్తోందని కేతన్ గుడ్డిగా నమ్మాడు. కానీ, ఆ వీడియోలో ఆమె చూపించిన ప్రేమంతా కేవలం ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేసిన నటన మాత్రమేనని పోలీసుల విచారణలో తేలింది.
లోయలోకి తోసి చంపేశారు..
పెళ్లికి ముందే కేతన్ ఆస్తిపై కన్నేసిన సియా.. తన అసలు ప్రియుడైన చేతన్‌తో కలిసి ఒక భయంకరమైన కుట్ర పన్నింది. ప్రీ వెడ్డింగ్ షూట్ నెపంతో కేతన్‌ను లోహగఢ్ కొండపైకి తీసుకెళ్లి, అక్కడ ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడితో కలిసి నిలువునా లోయలోకి తోసి దారుణంగా హత్య చేసింది.
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
కేతన్ సోదరి అనుమానంతో ఈ మరణం వెనుక ఉన్న హత్య కోణం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో నెటిజన్లు సియాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
“షూటింగ్‌లో అంత ప్రేమగా నటించిన సియా, గుండెల్లో ఇంత విషాన్ని ఎలా దాచుకుంది? పెళ్లి ఇష్టం లేకపోతే ముందే వద్దని చెప్పాలి కానీ, ఇలా ఒకరి జీవితాన్ని, నమ్మకాన్ని బలితీసుకోవడం ఏంటి?” అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పూణే పోలీసులు నిందితులు సియా, చేతన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నమ్మించి గొంతు కోసే ఇలాంటి వారికి కోర్టు కఠినమైన శిక్షలు విధించాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.







