Annamalai New Political Party | దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. . దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే (NDA) కూటమిలో చీలికలు మొదలయ్యాయి. తాజాగా ఊహించని విధంగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై (K Annamalai) పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం అత్యవసరంగా ఢిల్లీ వెళ్లిన అన్నామలై.. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను వరుసగా కలిశారు. అనంతరం నితిన్ నబీన్‌కి తన అధికారిక రాజీనామా లేఖను సమర్పించారు. అన్నామలై వైఖరితో తమిళనాడు బీజేపీలోనూ భారీ చీలిక వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై తన భవిష్యత్తు కార్యాచరణపై నేడో, రేపో అధికారికంగా ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. అయితే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారంటూ తమిళనాట విస్తృత ప్రచారం జరుగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై క్లీన్ ఇమేజ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్ కలిస్తే తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కావడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Annamalai Anbu Koottam New Membership Enrollment Drive, Annamalai Differences With Central BJP On Three Language Policy, Annamalai Meets BL Santhosh Over Tamil Nadu Political Future, Annamalai Rejects BJP Rajya Sabha Berth And Central Positions, Former Tamil Nadu BJP Chief Annamalai New Political Party Launch, అన్నామలై కొత్త రాజకీయ పార్టీ తమిళనాడు, అన్నామలై బీజేపీ రాజీనామా ఊహాగానాలు, జాతీయ రాజకీయాలు తెలుగు







