Saturday 23rd May 2026
12:07:03 PM
Home > క్రీడలు > కోహ్లీ Vs హెడ్.. ఉప్పల్ స్టేడియంలో హైడ్రామా!

కోహ్లీ Vs హెడ్.. ఉప్పల్ స్టేడియంలో హైడ్రామా!

kohli vs head

మ్యాచ్ అయ్యాక హ్యాండ్‌షేక్ నిరాకరించిన కింగ్..

Kohli Vs Head | ఐపీఎల్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మ్యాచ్ అంటేనే హై-వోల్టేజ్ డ్రామాకు కేరాఫ్ అడ్రస్.

శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్) లో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించినప్పటికీ.. మైదానం వెలుపల విరాట్ కోహ్లీ, ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది.

మైదానంలో ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం కాస్తా.. చివరకు మ్యాచ్ అయ్యాక పరస్పరం కరచాలనం చేసుకోనివ్వనంత స్థాయికి వెళ్లడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ విధ్వంసం.. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత ఓవర్లలో 255 పరుగుల భారీ కొండలాంటి లక్ష్యాన్ని బెంగళూరు ముందు ఉంచింది. అయితే ఈ భారీ ఛేదనలో ఆర్సీబీ తడబడి 200 పరుగులకే పరిమితమైంది.

దీంతో 55 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ ఫలితం కంటే.. కోహ్లీ-హెడ్ మధ్య నడిచిన స్లెడ్జింగ్ వార్ హైలైట్‌గా నిలిచింది.

మైదానంలో అసలేం జరిగింది?
ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ట్రావిస్ హెడ్ అతన్ని ఉద్దేశించి ఏదో కామెంట్ చేశాడు. అక్కడి నుంచి వివాదం మొదలైంది.

హెడ్ అన్న మాటలకు కింగ్ కోహ్లీ కాస్త ఆవేశంగా స్పందిస్తూ.. “నువ్వే అంతగా మాట్లాడాలనుకుంటే, వచ్చి బౌలింగ్ చేయొచ్చు కదా!” అని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

అగ్నికి ఆజ్యం పోసిన సాకిబ్ హుస్సేన్ వికెట్.. ఆ తర్వాత 15 పరుగులు చేసిన కోహ్లీ.. యువ సంచలనం సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ ఔట్ కాగానే ట్రావిస్ హెడ్ మరింత రెచ్చిపోయాడు.

హెడ్ పంచ్ – కోహ్లీ అసహనం..
కోహ్లీ పక్క నుంచి వెళ్తుండగా హెడ్ నవ్వుతూ.. “నేను బౌలింగ్ చేయడానికి రాకముందే నువ్వు ఔట్ అయిపోయావుగా!” అంటూ తీవ్రంగా స్లెడ్జ్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో కోహ్లీ తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి లోనయ్యాడు.

మ్యాచ్ ముగిసాక కోహ్లీ ఊహించని రియాక్షన్..
హెడ్ ప్రవర్తనపై తీవ్ర కోపంతో ఉన్న విరాట్ కోహ్లీ.. మ్యాచ్ ముగిసిన అనంతరం గ్రౌండ్‌లోకి వచ్చాడు. సాంప్రదాయం ప్రకారం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్, అలాగే అభిషేక్ శర్మలకు నవ్వుతూ హ్యాండ్‌షేక్ ఇచ్చాడు.

కానీ సరిగ్గా ట్రావిస్ హెడ్ తన ముందుకు రాగానే, కోహ్లీ అతన్ని అస్సలు పట్టించుకోకుండా, కళ్లల్లోకి కూడా చూడకుండా హ్యాండ్‌షేక్ ఇవ్వకుండానే ముందుకు వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions