Wednesday 20th May 2026
12:07:03 PM
Home > తాజా > కేబీకే గ్రూప్ చైర్మన్ భరత్ కుమార్ తో నాగం వర్షిత్ రెడ్డి భేటీ!

కేబీకే గ్రూప్ చైర్మన్ భరత్ కుమార్ తో నాగం వర్షిత్ రెడ్డి భేటీ!

nvr meets kbk

ఉప్పల్/నల్లగొండ: కేబీకే (KBK) గ్రూప్ చైర్మన్ కక్కిరేణి భరత్ కుమార్‌ను మంగళవారం నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్ ఉప్పల్‌లోని కేబీకే గ్రూప్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా నాగం వర్షిత్ రెడ్డిని భరత్ కుమార్ శాలువాతో సత్కరించారు.

ఈ స్నేహపూర్వక భేటీలో భాగంగా.. కేబీకే గ్రూప్ అందిస్తున్న సేవలు, సంస్థ సాగిస్తున్న వివిధ వ్యాపార కార్యకలాపాల గురించి నాగం వర్షిత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. యువ పారిశ్రామికవేత్తగా భరత్ కుమార్ సాధిస్తున్న విజయాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

కేవలం వ్యాపార అంశాలకే పరిమితం కాకుండా.. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల, ముఖ్యంగా తెలంగాణలోని సమకాలీన రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, యువత రాజకీయాల వైపు చూస్తున్న విధానంపై అభిప్రాయాలను పంచుకున్నారు.

యువత కేవలం ఉద్యోగాల వైపు మాత్రమే కాకుండా సరికొత్త స్టార్టప్స్, బిజినెస్ మోడల్స్ వైపు అడుగులు వేయడానికి ఎలాంటి ప్రోత్సాహం అవసరమనే కోణంలో ఇద్దరు యువ నాయకులు తమ ఆలోచనలను పంచుకున్నారు. 

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions