Tuesday 19th May 2026
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్!

Metro

‌- పట్టాలెక్కనున్న 60 కొత్త కోచ్‌లు..

Hyd Metro To Increase Coaches | భాగ్యనగర మెట్రో ప్రయాణికులకు త్వరలోనే కిక్కిరిసిన ప్రయాణాల నుంచి ఉపశమనం లభించనుంది. రద్దీ వేళల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

మెట్రో రైళ్ల కోసం సుమారు 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేసేందుకు బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌’ (BEML)తో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతోంది.

ఈ వారంలోనే దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్డర్ ఇచ్చిన 15 నెలల్లోనే ఈ కోచ్‌లు హైదరాబాద్‌కు సరఫరా కానున్నాయి.

ప్రస్తుతం ఎందుకీ కొరత..
నగరంలో ప్రస్తుతం 3 కారిడార్లలో మొత్తం 56 మెట్రో రైళ్లు నడుస్తుండగా, ఒక్కో రైలుకు 3 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా నాగోల్‌-రాయదుర్గం, ఎల్బీనగర్‌-మియాపూర్‌ మార్గాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ కోచ్‌లు ఏమాత్రం సరిపోవడం లేదు.

గతంలో నాగ్‌పూర్ నుంచి లీజుకు తెచ్చుకుందామన్నా సాంకేతిక కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు మెట్రో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో కొత్త కోచ్‌ల కొనుగోలుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

ఒకేసారి 965 మంది..
గతంలో 2015లో రూ.1,800 కోట్లతో సౌత్ కొరియాకు చెందిన ‘హ్యుందాయ్ రొటెమ్’ సంస్థ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక డ్రైవర్ లెస్ సాంకేతికతనే, ఇప్పుడు కొత్త కోచ్‌ల తయారీ కోసం BEML సంస్థకు బదిలీ చేసేందుకు అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఎల్‌ & టీ శకం ముగింపు..
గత 15 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రైవేటు (PPP) భాగస్వామ్య ప్రాజెక్ట్‌ గా సాగిన ఎల్‌అండ్‌టీ ప్రస్థానానికి స్వస్తి పలికి, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ (Phase 1)ను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ (HMRL) ద్వారా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions