Sunday 17th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > “పక్క రాష్ట్రంలో ఆయన సీఎం అవ్వగానే నాతో పోలికా?”

“పక్క రాష్ట్రంలో ఆయన సీఎం అవ్వగానే నాతో పోలికా?”

pawan kalyan

–  పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
పొంతన లేని ప్రచారాలంటూ అసహనం!

Pawan Kalyan Hot Comments | తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (TVK) ఘనవిజయం సాధించి, దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది.

విజయ్ తరహాలోనే పవన్ కల్యాణ్ కూడా ఏపీలో ఒంటరి పోరాటం చేసి సీఎం కావాలంటూ వస్తున్న కథనాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు ఘాటుగా స్పందించారు. తనతో విజయ్‌ను పోల్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

2019లోనే మేము ప్రయత్నించాం..
“2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా ఇప్పుడు టివికె (TVK) చేసినట్టే ఒంటరిగా ప్రయత్నించింది. కానీ ఆ ఎన్నికల్లో నేను పోటీ చేసిన రెండు చోట్లా నన్ను ఓడించారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు పూర్తిగా వేరు” అని పవన్ స్పష్టం చేశారు.

తనకు పదవులపై వ్యామోహం లేదని పవన్ గుర్తు చేశారు. “నాకు పదవులే ముఖ్యం అనుకుంటే 2009లోనే ప్రజారాజ్యం పార్టీ తరఫున మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఎంపీ అయ్యేవాడిని. కానీ నేను ఎప్పుడూ పదవి కోసం ఆశపడలేదు” అని పేర్కొన్నారు.

ఊర్లో పెళ్లికి హడావిడి లాగా ఉంది..
పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి సీఎం అవ్వగానే, ఇక్కడ తనతో పోలికలు పెట్టడం సరికాదన్నారు. “ఊర్లో పెళ్లికి ఏదో హడావిడి అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప ఒక పార్టీని నడపలేం” అని హితవు పలికారు.

అలాంటి ప్రచారాలు మానుకోండి..
తన రాజకీయ ప్రస్థానానికి, ఇతరుల విజయాలకు పొంతన లేని పోలికలు తెస్తూ సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారాలను ఇప్పటికైనా మానుకోవాలని పవన్ కల్యాణ్ గట్టిగా కోరారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions