Friday 15th May 2026
12:07:03 PM
Home > Uncategorized > NEET UG రీ-ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. మళ్లీ ఎప్పుడంటే!

NEET UG రీ-ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. మళ్లీ ఎప్పుడంటే!

NEET

NEET UG 2026 re-exam date | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG) క్వశ్చన్ పేపర్ లీక్ నేపథ్యంలో, రద్దయిన పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొత్త తేదీని ఖరారు చేసింది. జూన్ 21, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారికంగా ప్రకటించింది.

 గతంలో దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది విద్యార్థులు తిరిగి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేయాల్సిన పని కూడా లేదు. గతంలో అప్లై చేసిన విద్యార్థులందరూ ఈ పరీక్షకు అర్హులే. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ మరియు సెంటర్ల వివరాలను త్వరలోనే ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ఎందుకు రద్దు..
మే 3న జరిగిన పరీక్షకు ఒక రోజు ముందే పేపర్ లీక్ కావడంతో, పరీక్ష పారదర్శకతను కాపాడేందుకు ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పరీక్షకు కేవలం కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండటంతో విద్యార్థులు ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాలని ఎన్టీఏ సూచించింది.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in/NEET ను ఫాలో అవ్వాలని కోరింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions