Wednesday 17th June 2026
12:07:03 PM
Home > తాజా > తిరుమలలో టాలీవుడ్ హీరో వివాహం..హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు!

తిరుమలలో టాలీవుడ్ హీరో వివాహం..హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు!

bellamkonda srinivas wedding

Bellamkonda Srinivas Wedding | ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ వేడుక తిరుమల క్షేత్రంలో ఘనంగా జరిగింది.

బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో కావ్య రెడ్డితో కలిసి శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

భారీ హంగామా లేకుండా, ఆధ్యాత్మిక వాతావరణంలో తిరుమలలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఈ వివాహం నిరాడంబరంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు రాజకీయ నాయకుల, టాలీవుడ్ కు చెందిన పలువురు అగ్ర నటులు, నిర్మాతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తమ్ముడి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి.

నూతన దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions