Wednesday 8th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఒక కర్మయోగిని చూశాను.. పవన్ పై దర్శకుడు బాబీ ఎమోషనల్ పోస్ట్!

ఒక కర్మయోగిని చూశాను.. పవన్ పై దర్శకుడు బాబీ ఎమోషనల్ పోస్ట్!

bobby pawan

Director Bobby emotional post on Pawan Kalyan | జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రముఖ దర్శకుడు బాబీ (కొల్లి రవీంద్ర) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీ అనంతరం బాబీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అనుభూతులు ఇప్పుడు పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్‌తో తాను దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ, ఆయనలోని నిరాడంబరతను, నిబద్ధతను బాబీ ఆకాశానికెత్తారు.

బాబీ తన పోస్ట్‌లో పవన్ కళ్యాణ్‌ను ఒక ‘కర్మయోగి’గా అభివర్ణించారు. “జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ నేను ప్రత్యక్షంగా చూశాను” అని పేర్కొన్నారు.

“ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం కలిగింది. ఆయనతో పనిచేసినప్పుడు (సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో) ఆయన అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి.

కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. హోదా మారినా, లోపలికి వెళ్లగానే చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషిలా ఆయన కనిపించారు” అని బాబీ భావోద్వేగానికి లోనయ్యారు.

రాజకీయాల్లోకి రాగానే ఆస్తులు పెంచుకునే వ్యక్తులను చూశామని, కానీ పవన్ కళ్యాణ్ తనకున్న అన్ని సౌకర్యాలను వదులుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్నారని, ఆ వ్యక్తిత్వం తనకు ఒక శిఖరంలా కనిపించిందని బాబీ కొనియాడారు.

అక్కడ ఉన్నంత సేపూ పవన్ చూపించిన ఆత్మీయతకు తాను ‘ఫిదా’ అయిపోయానని, “లవ్ యు ఆల్వేస్ మై పవర్ స్టార్” అంటూ తన పోస్ట్‌ను ముగించారు.

గతంలో పవన్ కళ్యాణ్ – బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం మాత్రం నేటికీ అలాగే ఉండటం విశేషం.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions