- ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Suryavanshi Record | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో ఒక కొత్త రికార్డు నమోదయ్యింది. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
అతిపిన్న వయసులోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.
హెడ్, రైనాలనే వెనక్కి నెట్టి..
గౌహతీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగుల మార్కును చేరుకున్నాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా.. గతంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, సురేష్ రైనా, ఇషాన్ కిషన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ రికార్డులను వైభవ్ అధిగమించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ బౌలర్ల ధాటికి కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌కు వైభవ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.
వైభవ్ సృష్టించిన సునామీతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మార్చి 27వ తేదీనే 15వ ఏట అడుగుపెట్టిన ఈ బీహార్ కుర్రాడు, తన పుట్టినరోజు ముగిసిన కొద్ది రోజులకే ఐపీఎల్ వేదికగా ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘వైభవ్ సూర్యవంశీ’ పేరు మారుమోగిపోతోంది.






