MK Pasha Appointed As Chief Commissioner | దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సైక్లిస్టుల ప్రతిభను చాటిచెప్పేందుకు సిద్ధమవుతున్న ‘అస్మిత ఉమెన్స్ రోడ్ సైక్లింగ్ లీగ్’ (Asmita Women’s Road Cycling League) జాతీయ స్థాయి పోటీలకు సర్వం సిద్ధమైంది.
సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CFI), ఖేలో ఇండియా (Khelo India) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు చీఫ్ కమిషనర్‌గా (చీఫ్ రెఫరీ) ఎం. కె. పాషా అధికారికంగా నియమితులయ్యారు.
ఏప్రిల్ 4,5 తేదీల్లో హైదరాబాద్ లోనే ఈ జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అత్యుత్తమ సైక్లిస్టులు ఈ రేసులో పాల్గొనబోతున్నారు.
సీనియర్, జూనియర్ మరియు సబ్-జూనియర్ గర్ల్స్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.
జాతీయ స్థాయి పోటీలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించడంలో చీఫ్ కమిషనర్ పాత్ర అత్యంత కీలకం. ఈ బాధ్యతల్లో భాగంగా ఎం. కె. పాషా రేసు ఆపరేషన్లను పర్యవేక్షిస్తారు.
క్రీడాకారిణుల మధ్య నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోటీ జరిగేలా చూస్తారు. అంతర్జాతీయ సైక్లింగ్ ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలు (Technical Regulations) కచ్చితంగా అమలు అయ్యేలా పర్యవేక్షిస్తారు.
మహిళా క్రీడాకారిణులను జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అస్మిత’ (ASMITA) పథకం కింద ఈ లీగ్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లో ఈ పోటీలు జరగడం వల్ల స్థానిక మహిళా సైక్లిస్టులకు గొప్ప స్ఫూర్తి లభిస్తుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.






