Sunday 14th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పెళ్లి వయసైపోతోంది.. వధువు కోసం యువకుల వినూత్న ఆలోచన!

పెళ్లి వయసైపోతోంది.. వధువు కోసం యువకుల వినూత్న ఆలోచన!

wanted bride

Wanted Bride Banner | ఇటీవల కాలంలో అమ్మాయిలు దొరక్క చాలా మంది యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో పెళ్లి వయసు దాటిపోయినా బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. తగిన వధువు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఏపీలోని ఓ గ్రామంలో కొంతమంది యువకులకు వధువుకోసం వినూత్న ఆలోచన చేశారు. పెళ్లి కాకుండా ఉన్న యువకుల సమస్యను అందరి దృష్టికి తీసుకొచ్చేలా గ్రామస్తులు బ్యానర్‌ ప్రదర్శించారు.

చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో కనుమ పండుగ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేక బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ లో కొంతమంది ఫొటోలకు స్టార్ గుర్తును వేశారు. అందులో ముఖ్య గమనిక: స్టార్ యువకులకు వధువు కావలెను. అని రాశారు.

పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్న యువకుల పరిస్థితిని సరదాగా, సామాజిక స్పృహతో కలిపి చూపించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని గ్రామ పెద్దలు తెలిపారు.

కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు ఇది సమాజంలో పెళ్లి సమస్యపై ఆలోచన రేకెత్తించే ప్రయత్నమని వ్యాఖ్యానించారు. మొత్తంగా కలికిరిపల్లి గ్రామంలో ప్రదర్శించిన ఈ బ్యానర్ సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions