Tuesday 11th August 2026
12:07:03 PM
Home > క్రైమ్ > బస్సులో అసభ్యంగా తాకాడాని ఆరోపిస్తూ మహిళ వీడియో.. చివరికి..!

బస్సులో అసభ్యంగా తాకాడాని ఆరోపిస్తూ మహిళ వీడియో.. చివరికి..!

kerala man dies

Kerala man dies | కేరళలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఓ వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడని ఆరోపిస్తూ  ఒక మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మృతుడిని కోజికోడ్‌లోని గోవిందపురం నివాసి అయిన దీపక్ (40)గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున అతను తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు.

రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా లైంగిక దురుద్దేశంతో తన శరీరాన్ని తాకాడని ఆ మహిళ సోషల్ మీడియా ద్వారా ఆరోపించింది.

ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది, 2 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో ప్రచారంలోకి వచ్చిన తర్వాత, దీపక్ మానసికంగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడని బంధువులు, స్నేహితులు తెలిపారు. ఈ వీడియో ద్వారా అతని వ్యక్తిత్వాన్ని కించపరిచారని అతని కుటుంబం ఆరోపించింది.

ఆ మహిళ సోషల్ మీడియాలో ప్రచారం కోసమే ఈ కంటెంట్‌ను సృష్టించిందని పేర్కొన్నారు. కోజికోడ్ మెడికల్ కాలేజ్ పోలీసులు అసాధారణ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
vijay swearing in ceremony
మూడు రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై తమిళనాడు నిషేధం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions