Wednesday 2nd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఎర్రకోట బ్లాస్ట్..వెలుగులోకి ఉగ్రవాది సెల్ఫీ వీడియో

ఎర్రకోట బ్లాస్ట్..వెలుగులోకి ఉగ్రవాది సెల్ఫీ వీడియో

Delhi Bomber’s Chilling Video | ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబర్ 10న సాయంత్రం హ్యుండాయ్ ఐ 20 కారులో భారీ బ్లాస్ట్ జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందారు. అయితే కారులో బ్లాస్ట్ కు పాల్పడిన ఉమర్ నబీకి సంబంధించిన వీడియో ఒకటి తాజగా వైరల్ గా మారింది.

పేలుడు ఘటన కంటే ముందు దీన్ని రికార్డు చెసిన నబీ ఉగ్రవాదం గురించి, ఉగ్ర చర్యల గురించి మాట్లాడుతూ ఇవి దైవకార్యాలు అని పేర్కొనడం కలకలం రేపింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు గురించి అందరూ తప్పుగా అర్ధం చేసుకుంటారని కానీ అదొక బలిదాన ఆపరేషన్ అని ఈ ఉగ్రవాది తన ఉగ్ర దాడులను సమర్ధించుకున్నాడు.

ఉగ్ర బలిదానం అనేది దైవ కార్యం అంటూ ఇతడు వీడియోలో రెచ్చగొట్టాడు. అయితే బాబ్రీ మస్జీద్ కూల్చివేసిన డిసెంబర్ ఆరున ఈ వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ సూసైడ్ బాంబర్ కోసం ఉమర్ నబీ తీవ్రంగా వెతికినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఫరీదాబాద్ లో టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టైంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions