Monday 12th January 2026
12:07:03 PM
Home > క్రైమ్ > దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే!

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే!

case filed on rajamouli

Case Filed on SS Rajamouli | ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ అనే ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదు అయ్యింది.

ఆ ఈవెంట్ లో రాజమౌళి హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ‘రాష్ట్రీయ వానరసేన’ అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును అందజేసింది.

మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్, ట్రైలర్ లాంఛ్  ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆ సంస్థ ఆరోపించింది. “ఇటీవల సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరిగింది.

మత విశ్వాసాలను దెబ్బతీయడం చట్టవిరుద్ధం. రాజమౌళిపై కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ జరపాలి” అని రాష్ట్రీయ వానరసేన సంస్థ సభ్యులు డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వానరసేన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

You may also like
న్యూ ఇయర్ సర్ప్రైజ్..పవన్ కొత్త సినిమా
Mrunal Thakur
రూమర్ల పై మృణాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ధనుష్ తో రిలేషన్ షిప్ పైనే(నా)!
మాజీ మంత్రితో పంచాయతీ..క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం
case filed on rajamouli
‘హనుమంతుడిపై కోపం వచ్చింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions