Telangana Govt notifies allotment of 2,620 retail liquor outlets for 2025-27 | తెలంగాణలో వైన్స్ షాపుల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కోసం ప్రభుత్వం లైసెన్సులు జారీ చేయనుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది. శుక్రవారం మొదలు అక్టోబర్ 18 వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్దతిలో వైన్ షాపుల కేటాయింపు జరుగుతుంది.
టెండర్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తు రుసుము రూ.3 లక్షలుగా ఉంది. ఇకపోతే దుకాణాల కేటాయింపులో గౌడ్లకు 15%, ఎస్సిలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు ఉన్న విషయం తెల్సిందే.









