Monday 31st August 2026
12:07:03 PM
Home > తాజా > ‘OG’ లో ప్రకాశ్ రాజ్..ఫ్యాన్స్ షాక్ !

‘OG’ లో ప్రకాశ్ రాజ్..ఫ్యాన్స్ షాక్ !

OG: Prakash Raj Introduced as Satya Dada | ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన మచ్ అవైటెడ్ సినిమా ‘ఓజి’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయిక.

సెప్టెంబర్ 25న మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలని పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అర్జున్ దాస్ పోస్టర్ విడుదల చేయగా తాజగా ప్రకాష్ రాజ్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఓజిలో ప్రకాష్ రాజ్ సత్య దాదా గా కనిపించనున్నారు. అయితే ప్రకాష్ రాజ్ ఓజిలో కనిపించనుండడం పట్ల కొందరు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సైద్ధాంతిక పరంగా పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే.

పలు సందర్భాల్లో పవన్ పై నేరుగా తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. ఈ క్రమంలో పవన్ సినిమాలో ప్రకాష్ రాజ్ నటిస్తుండడం ఆసక్తిగా మారింది. అయితే రాజకీయాలు, సినిమా వేరు అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions