Friday 1st May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బాధితుల కోసం యాప్..మనం వచ్చాక సినిమా చూపిద్దాం’

‘బాధితుల కోసం యాప్..మనం వచ్చాక సినిమా చూపిద్దాం’

Ys Jagan News Latest | వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అన్యాయానికి, వేధింపులకి గురవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు లేదా రాజకీయ నేతలు ఇలా ఎవరైనా వేధిస్తే సదరు యాపులో బాధితులు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. వేధింపులకు సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉంటే వాటిని కూడా ఇందులో అప్లోడ్ చేయొచ్చని చెప్పారు.

ఆ తర్వాత బాధితుడు చేసిన ఫిర్యాదు వైసీపీ యొక్క డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే, తాను ముఖ్యమంత్రి అవ్వగానే ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన ఉంటుందన్నారు. భాద్యులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అలాగే బాధితులకు న్యాయం చేస్తామని జగన్ చెప్పారు. తప్పు చేసినవారికి సినిమా చూపించడం ఖాయం అన్నారు. చంద్రబాబు ఏదైతే విత్తనం నాటుతున్నారో అదే రేపు చెట్టు అవుతుందని వ్యాఖ్యానించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions