Monday 23rd March 2026
12:07:03 PM
Home > తాజా > ఇది పుష్ప-3 షూటింగ్ కాదు..నదిలో కలప దుంగలు

ఇది పుష్ప-3 షూటింగ్ కాదు..నదిలో కలప దుంగలు

hundreds of logs flowing downstream | ఇది పుష్ప సినిమా షూటింగ్ కాదు. హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం ఆకస్మిక వరదలు పోటెత్తాయి.

దింతో కుల్లు జిల్లాలోని ఓ నదిలో ఇలా భారీగా కలప దుంగలు కొట్టుకు వచ్చాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇంతటి స్థాయిలో కలప దుంగలు కొట్టుకురావడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.

దీని భట్టి చుస్తే అడవుల్లో అక్రమ కలప వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం అవుతుందని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దింతో వరదలు పోటెత్తాయి.

ఈ నేపథ్యంలో పలువురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గల్లంతు అయ్యారు. వీరిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికార యంత్రాంగం కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. బియాస్, సట్లెజ్ నదుల్లో నీటి మట్టం అమాంతం పెరుగుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు మ్

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions