Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఇప్పుడు సినిమా మీద పడ్డ ట్రంప్’

‘ఇప్పుడు సినిమా మీద పడ్డ ట్రంప్’

Donald Trump’s 100% movie tariff | అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టారిఫుల మోతతో ప్రపంచాన్నే హడలెత్తించిన ట్రంప్ తాజగా సినిమా మీద పడ్డారు.

అమెరికా సినీ పరిశ్రమను రక్షించే ప్రయత్నంలో భాగంగా విదేశాల్లో నిర్మించి అమెరికాలో విడుదలయ్యే సినిమాలపై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం అమెరికా సినీ పరిశ్రమ హాలీవుడ్‌ను పరిరక్షించడం మరియు దేశీయ చిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ఈ చర్య వల్ల భారతీయ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాల విడుదల ఖర్చు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది, దీంతో టికెట్ ధరలు కూడా పెరగవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ తన ప్రకటనలో, హాలీవుడ్ మరియు అమెరికా సినీ రంగం ఇతర దేశాల “సమష్టి కుట్ర” వల్ల నాశనం అవుతుందని ఆరోపించారు.

కొన్ని దేశాలు సినిమా నిర్మాణ సంస్థలకు భారీ పన్ను మినహాయింపులు ఇస్తున్నాయని, దీంతో అమెరికన్ స్టూడియోలు తమ కార్యకలాపాలను కెనడాలోని టొరంటో, ఐర్లాండ్‌లోని డబ్లిన్ వంటి నగరాలకు తరలిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ, విదేశీ సినిమాలపై 100 శాతం సుంకం విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వాణిజ్య శాఖ మరియు వాణిజ్య ప్రతినిధులకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

ట్రంప్ మాట్లాడుతూ, “అమెరికాలో మళ్లీ సినిమాలు తీయాలని మేము కోరుకుంటున్నాము. కొత్త సుంకాలు అమెరికన్ గడ్డపై స్టూడియోలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రోత్సహిస్తాయి” అని అన్నారు.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions