Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!

నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!

tgsrtc

TGSRTC Conductor | టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు తన నిజాయతీ చాటుకున్నారు. బస్సులో ఓ వ్యక్తి పోగొట్టుకున్న రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేశారు.

అచ్చంపేట డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు ను ఈ సందర్బంగా టీజీఎస్ఆర్టిసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో సోమవారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆయనను సన్మానించి.. ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

అచ్చంపేట-హైదరాబాద్ రూట్ టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఈ నెల 26న కండక్టర్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎంజీబీఎస్ కు చేరుకోగానే బస్సులో ఒక బ్యాగ్ ను ప్రయాణికుడు మరచిపోయినట్లు కండక్టర్ గుర్తించారు.

బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు, వెండి ఆభరణాలతో, నగదు, పలు సర్టిఫికెట్లు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని  అచ్చంపేట డీఎం మురళీ దుర్గా ప్రసాద్ కు  ఫోన్ లో కండక్టర్ సమాచారం అందించారు.

బ్యాగ్ ను ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో అప్పగించాలని డీఎం సూచించారు. ఇంతలోనే అనిల్ కుమార్ అనే ప్రయాణికుడు డీఎంకి ఫోన్ చేసి బస్సులో బ్యాగును మరచిపోయినట్లు చెప్పారు. కందుకూర్ లో బస్సు ఎక్కి సీబీఎస్ లో దిగి కాచిగూడకు వెళ్లిపోయానని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలని డీఎం సూచించారు.

టీజీఎస్ఆర్టిసీ అధికారులు వివరాలను పరిశీలించి.. బ్యాగును ప్రయాణికుడు అనిల్ కుమార్ కు అందజేశారు. అందులో 14 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.14,800 నగదు, తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్, తన విద్యార్హత ధ్రువపత్రాలు ఉన్నాయి.

విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి రూ.13 లక్షల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసిన కండక్టర్ వెంకటేశ్వర్లు ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు. 

You may also like
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
ఈ సిరప్ వాడడం వెంటనే ఆపండి
vc sajjanar
వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు: వీసీ సజ్జనార్
panthangi tollgate
‘సంక్రాంతి’ ట్రాఫిక్ ను తగ్గించడానికి హైవే టోల్ గేట్ల వద్ద వినూత్న ప్రయోగం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions