Friday 30th January 2026
12:07:03 PM
Home > క్రీడలు > 38 ఏళ్ల వయస్సులో డబుల్ సెంచరీ..సచిన్ రికార్డు బ్రేక్

38 ఏళ్ల వయస్సులో డబుల్ సెంచరీ..సచిన్ రికార్డు బ్రేక్

Usman Khawaja Breaks Sachin’s Record | నాలుగు పదుల వయస్సు సమీపిస్తున్నా ఆస్ట్రేలియా ( Australia ) ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం పరుగుల వరద పారిస్తున్నాడు.

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ప్లేయర్లు రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా ఓపెనర్ ఖవాజా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సెంచరీ సాధించిన ఖవాజా రెండవ రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించాడు.

16 ఫోర్లు, ఒక సిక్సర్ తో 232 పరుగులు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన అతిపెద్ద వయస్కుడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) రికార్డును బద్దలు కొట్టాడు.

2010 ఏప్రిల్ లో 37 ఏళ్ల వయసులో సచిన్ 203 పరుగులు చేశారు. అయితే 38 వయస్సులో డబుల్ సెంచరీని అందుకుని ఖవాజా ఈ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే శ్రీలంకలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా ఘనతను సొంతం చేసుకున్నాడు.

మరోవైపు స్టీవ్ స్మిత్ ( Steve Smith ), ఇంగ్లీస్ ( Josh Inglis )కూడా సెంచరీలు బాదడంతో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు నష్టపోయి 654 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది.

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions