Keerthy Suresh To Marry Antony In Goa Next Month | చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ ( Antony )ని నటి కీర్తి సురేష్ వివాహం చేసుకోనుందనే విషయం తెల్సిందే.
సోషల్ మీడియా ( Social Media ) ద్వారా స్వయంగా కీర్తినే ఈ విషయాన్ని ప్రకటించింది. తాజగా పెళ్లి ఎప్పుడు జరగనుందో అనే విషయం పై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం కీర్తి సురేష్ కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో తన పెళ్లి జరగనున్నట్లు చెప్పారు. గోవా ( Goa )లో వివాహవేడుక జరగనుందన్నారు.
అంతేకాకుండా వచ్చే నెలలో తన హిందీ సినిమా కూడా విడుదల అవుతుందని తెలిపారు. అందుకోసమే స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు.