Tuesday 8th September 2026
12:07:03 PM
Home > తాజా > జన్వాడలో రేవ్ పార్టీ..రెండు కేసులు బుక్ చేసిన పోలీసులు

జన్వాడలో రేవ్ పార్టీ..రెండు కేసులు బుక్ చేసిన పోలీసులు

Janwada Farmhouse Rave Party News | హైదరాబాద్ ( Hyderabad )శివారు జన్వాడ ఫార్మ్ హౌస్ లో శనివారం రాత్రి పార్టీ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఓటి ( SOT ) పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ పార్టీలో మొత్తం 35 మంది వరకు పాల్గొన్నారు. అనుమతి లేని విదేశీ మద్యాన్ని పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల ఫార్మ్ హౌస్ ( Raj Pakala Farmhouse ) లో రాజేంద్రప్రసాద్ పాకాల అనే వ్యక్తి పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈయన బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) బంధువు కావడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది.

సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో విజయ్ మద్దూరి ( Vijay Madduri )అనే వ్యక్తికి కోకైన్ పాజిటివ్ తేలింది. అనుమతి లేని విదేశీ మద్యాన్ని తీసుకువచ్చినందుకు ఎక్సైజ్ చట్టం మరియు డ్రగ్స్ సేవించినట్లు తేలడంతో NDPS చట్టం కింద రెండు కేసులు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions