Ys Jagan Petition On Sharmila And Vijayamma | మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ys Jagan ) తన తల్లి విజయమ్మ ( Vijayamma ), చెల్లి షర్మిల ( Sharmila ) పై పిటిషన్ దాఖలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే వైఎస్ కుటుంబం ( Ys Family )లో ఆస్తుల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తాయని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ( National Company Law Tribunal ) లో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ( Saraswati Power And Industries Private Limited )లో వాటాల కేటాయింపుపై వివాదం నెలకొంది. దీంతో జగన్ మరియు భారతి NCLTను ఆశ్రయించారు. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వృద్ధిలో తమ పాత్ర కీలకంగా ఉందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
షర్మిలకు వాటాలు కేటాయించేందుకు తాము 2019 ఆగస్టు 21న అవగాహన ఒప్పందం ( MOU )పై సంతకం చేశామని అయితే… వాటా కేటాయింపు ఇప్పటికీ ఖరారు కాలేదని పేర్కొన్నారు.
తన సోదరి వైఎస్ షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామని కానీ ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పిటిషన్‌లో తెలిపారు.
ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని.. తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని ఎన్‌సీఎల్‌టీని జగన్, భారతి అభ్యర్థించారు.