Tuesday 8th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పెళ్ళైన వారు 16మంది పిల్లల్ని కనండి.. చంద్రబాబు వ్యాఖ్యలకు మద్దతుగా స్టాలిన్

పెళ్ళైన వారు 16మంది పిల్లల్ని కనండి.. చంద్రబాబు వ్యాఖ్యలకు మద్దతుగా స్టాలిన్

Chandrababu And Stalin Urges People To Have More Children | ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధించారు తమిళనాడు సీఎం స్టాలిన్ ( Cm Stalin ).

జనాభా సమతుల్యత, పెరుగుతున్న వృద్ధ జనాభా దృష్ట్యా ఎక్కువ సంతానాన్ని కనాలి అని చంద్రబాబు చెప్పిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే పోటీ చేసే విదంగా నూతన చట్టం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు.

తాజాగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను కొనసాగింపుగా స్టాలిన్ మాట్లాడారు. సోమవారం చెన్నై ( Chennai )లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పెళ్ళైన వారికి 16 రకాల ఆస్తులు ఉండాలని అంటారు, ఆస్తుల స్థానంలో సంతానం ఎందుకు ఉండకూడదు అని సూచించారు.

జనాభా నియంత్రణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య కూడా తగ్గనున్నట్లు చెప్పారు. పరిస్తితులకు అనుగుణంగా మారాలని ఎక్కువ మంది పిల్లల్ని కనాలని స్టాలిన్ పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions