Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో దంగల్ సినిమా రిపీట్..తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు

తెలంగాణలో దంగల్ సినిమా రిపీట్..తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు

Daughters Fullfill Father Dream | తెలంగాణలో దంగల్ సినిమా రిపీట్ అయ్యింది. తండ్రి కలను కుమార్తెలు నిజం చేశారు. కొడంగల్ మండలం హుస్నాబాద్ కు చెందిన శ్రీశైలం గౌడ్ ఒక రైతు.

టీచర్ జాబ్ సాధించాలని శ్రీశైలం, నిరంతరం శ్రమించారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఉద్యోగం సాదించలేకపోయారు. కానీ తండ్రి సాదించలేకపోయిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని అతని ఇద్దరు కుమార్తెలు సాధించారు.

కుమార్తెలు సుధ, శ్రీకావ్యాలు ఉద్యోగం కోసం తండ్రి పడిన శ్రమను ప్రత్యక్షంగా చూశారు. తండ్రి కలను నిజం చేయాలని భావించారు. సుధ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి పూర్తి చేయగా, శ్రీకావ్య డీఎడ్ పూర్తిచేసింది.

పాఠశాల విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతూ డీఎస్సి కోసం రోజూ 14 నుండి 18 గంటలు కష్టపడేవారు. స్కూల్ అసిస్టెంట్ మాథ్స్, ఫిజికల్ సైన్స్ కోసం సిద్ధమైన సుధ మాథ్స్ లో రెండవ ర్యాంకు, ఫిజికల్ సైన్స్ లో మొదటి ర్యాంకు సాధించారు. మరోవైపు శ్రీకావ్య ఎస్జీటీగా ఎంపికయ్యారు.

ఈ నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ చేతుల మీదుగా హైదరాబాద్ లో నియామక పాత్రలు అందుకున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions